Monday, 12 February 2018

పర్యాయపదాలు-22


                                  పర్యాయపదాలు -22
661.పేగు=ఆంత్రము,ఇడ,ధమని,నాడి,పురీతత్తు,సిర.
662.పేడ=పెండ,గోమ(య-ల)ము,గోవిట్టు,గోహన్నము,జగలము,
              భూమిలేపనము.
663.పేను=అడమసి,ఇంద్రలుప్తము,ఓకణము,ఓకణి,ఓకోదని, కిటిభము,
               ఉద్దంశము,ఉత్కణము,కేశకీటము,పాళి,యూకము,ఈరు,ఈపి,
              అంటులు,అంట్లు,రోమవిధ్వంసకము,వారకీరము,
664.పేము=ప్రేము,బెత్తము,వేత్రము,వేణువు,వంశము,కీచకము,వానీరము.665.పేరు=నామ(ధేయ)ము,సంజ్ఞ,అభిధ,అభిదానము,అభిధేయము,
               ఆఖ్య,అభిఖ్య,ఆహ్వ(యము),ఉపాధి
666 nil.
667.పొన్న=పున్నాగము,పురుషాహ్వయము,తుంగాఖ్యము,పొన,
                రక్తకేశరము.
668.పొందబడినది=లబ్ధము,ప్రాప్తము,విన్నము,భావితము,భూతము,
                        ఆపాదితము.
669. పొగ=ఆవిరి,అగ్నివాహము,కచమాలము,ఖతమాలము,ధూమము,
               మేఘయోని,మేచకము,మరుద్వాహము,ధూపము,పోన,
               వ్యామము,శిఖిధ్వజము.
670.పొగడ=పావడ,కేసరము,మధ్యగంధము,వకుళము,విశారదము.
671.పొగాకు=కలంజము,గాజర,క్సమిఘ్న,తమాఖువు,తామ్రకూటము,
                ధూమ్రపత్రము,ధూసరము,బృహత్పత్రము,స్త్రీమలావాహ.
672.పొట్టివాడు=ఖర్వుడు,నీచుడు,హ్రస్వుడు,వామనుడు,గిటక,పొట్టి,
                 కుఱుచ,గిట్ట,గుజు,టింగణ,లింగణా,గిడ్డ,గిఱక.
673.పొడ(గు)వు =ఉచ్చత,ఉన్నతి,ఉచ్ఛ్రాయము,ఉత్సేధము,తుంగర,
                    ఊర్ధ్వత,ఉన్నాహము.
674.పొద=చిట్ట,జీలు,జొంపము,డొంక,తుప్ప,పొదరు,ఆస్కంధము,ఈరము,
               కందళి,కక్షము,గుల్మము,
675.పొదరిల్లు=పొద,పొదరుటిల్లు,కుంజము,నికుంజము,మంజరీకుంజము,
             ఛత్వరము,ఝూటము,మంజులము,మండపము,వల్లురము.
676.పొడి=చూర్ణము,క్షోదము,తుమురు,నుగ్గు,నుఱుము,పరుము,పిండి.
677.పొన్నగంటికూర=కాండపుష్ప,పత్తూరప్రియ,మత్స్యగంధ,మత్స్యాక్షి.
678.పోక=అక్రోటము,అమరపుష్పము,కరమట్టము,కల్పతరువు,క్రముకము,ఖపురము,ఘోంటాఫలము,గువాకము,చిక్కణము,పూగము,
            లక్ష్మీపతి,శౌభము,సురంజనము,స్రంసి,హ్రస్వకము.
679.పోవు=ఏగు,అరుగు,గమించు,చను,నిర్గమించు,వెడలు,వేంచేయు.
680.పోషించు=ఏలు,ఓము,పెంచు,ప్రోచు,మనుచు,సంతరించు.
681.పౌరుషము=కడిమి,గండు,బీరము,మగటిమి,మగతనము,విక్రమము.
682.ప్రభానుడు=ప్రముఖుడు,ప్రవేకుడు,అనుత్తముడు,ఉత్తముడు,ముఖ్యుడు,  వర్యుడు,వరేణ్యుడు,ప్రబర్హుడు,అనవరార్ధ్యుడు,అగ్రుడు,
     ప్రాగ్రహరుడు,ప్రాగ్ర్యుడు,అగ్ర్యుడు,అగ్రీయుడు,అగ్రియుడు.                  
683.ప్రబ్బ(లి)=అంబువేతసము,అభ్రపుష్పము,రధము,వానీరము,విదులము,వేతసము,వేత్రము,శీతము,పరివ్యాధము,నాదేయ,నిచులము,
                    నికుంచకము.
684.ప్రవాహము=ధార,నిట్ట,వేగము,స్రోతస్సు,నీటిపారుదల.
685.ప్రయాణము=గమనము,గమము,ప్రస్ధానము,యాత్ర,వ్రజ్య,(అభినిర్యాణము)
686.ప్రాణగొడ్డము=ప్రాణఘ్నము,ప్రాణఘ్ని,ప్రాణనాశకము,ప్రాణహరణము
687.ప్రాతఃకాలము=ప్రత్యూషము,ఆహర్ముఖము,కాలయము,ఉషస్సు,
                   ప్రత్యుషస్సు,ప్రభాతము,ప్రత్యుష.
688.ప్రాతది=పురాణము,ప్రతనము,ప్రత్నము,పురాతనము,చిరంతనము.
689.ప్రాదేశము=జుట్ట,జుత్త,జుట్టిలి,జుత్తిలి,జేన,ప్రదేశము,లొడితి.
690.ప్రత్తి=అంబరము,అఖరము,ఆనగ్నము,ఆచ్ఛాదనఫల,ఏకాష్టి,కర్పసి,
                కార్పాసము,గుణ,త్యన.
691.ప్రియము=అనుగు,అగ్మిలి,ఇంపు,ఇష్టము,కూర్మి, గాదిలి,గారవము,
                  గారాము,చెల్మి,నెయ్యము,నేర్మి,ప్రేముడి,మక్కువ,
                    ముద్దు,హితము.
692.ప్రేమ= అనురక్తి,అనురాగము,అభిమానము,ఆబంధము,ప్రణయము,
               రాగము.
                                         
                                         

2 comments:

  1. ఆవుపేడ పదానికి ఎటుచూసినా ఒకేలా ( వికటకవి లా) ఉండే పర్యాయపదం కావాలి

    ReplyDelete