Thursday, 15 February 2018

పర్యాయపదాలు-32

                             పర్యాయపదాలు-32
911.వెండ్రుకలు=అంగజములు,అలకములు,కచములు,కుంతలములు,
                 కేశములు,కురులు,చపలములు,చికురములు,నెఱకలు,
                 నెఱులు,శిరోరుహములు,వాలములు.
912.వెదుకబడినది=అన్వేషితము,గవేషితము,అన్విష్టము,మార్గితము,
                 మృగితము,వెదుక(అరయ)బడినది.
913.వెదురు=వంశము,త్వక్సారము,త్వచిసారము,కర్మారము,తృణ
               ధ్వజము,శతపర్వము,యవఫలము,వేణువు,మస్కరము,
                 తేజసము,కంటకము.
914.వెనుక=పిదప,తర్వాత,పదపడి,పిమ్మట,మునుపు,ముందు,మును
               మున్ను,తొలి,తొల్లి,తొలుత.
915.వెన్న=గవీనము,దధిజము,నవనీతము,నవోద్ధృతము,మంధజ
ము,  మంధసారము,హైయంగవీనము.
916.వెఱ్ఱివాడు=అపస్మారి,ఉన్మత్తుడు,తిక్క,వెంగలి,వెంబరివిత్తు,వెకలి, వెడగు,వీఱిడి,వేదుఱు.
917.వెల్లుల్లి=అరిష్టము,గృoజనము,బధ్ధశిఖ,భూతఘ్నము,ముఖదూషి,              మ్లేఛ్చకందము,రసు(సో)నము,రాహూచ్ఛిష్టము,లశునము,
      లోహితము,శుక్లమూలము,శుద్ధకందము,సోనహము.
918.వెలగ=ఆమ్లఫలము,కపీష్టము,కరండఫలము,కరభవల్లభము,
            కపిత్థము,గ్రాహి,చిరసాకి,తక్రభిత్తు,దంతశఠము,దధిత్ధము,
          దధిఛత్రము,దృఢఫలము,పుష్పఫలము,మాలూరము,లింగ
          వర్ధనము,సుమనఃఫలము,సురభిచ్ఛదము,సునావృక్షము,
         స్వరసము,స్వాదుకంటకము.
919.వెలిగారము=కనకక్షారము,టంకణము,టంగరము,ద్రావణకము,పాచనకము,రంగక్షారము,రసఘ్నము,రసశోధనము,లేహినము,
 లోహశుద్ధిదము,శుభగము,సింధులము,సౌభాగ్యము.
920.వేగము=శీఘ్రము,త్వరితము,లఘువు,క్షిప్రము,అరము,ద్రుతము,సత్వరము,చపలము,తూర్ణము,అవిలంబితము,ఆశు,చెచ్చెర,
             వేగిరము,త్వర,సరగ,వేగ,వైళము,వ్యసము,వడిగ,గ్రక్కున,
              గ్రద్దన,గ్రన్నన,గొబ్బున,దిగ్గున.
921.వేడి=ఆని,ఉక్క,ఉడుకు,ఉబ్బ,ఉష్ణము,ఖరము,ఘర్మము,చురుకు,తపము,తేజస్సు,నిదాఘము,ప్రతాపము,సంజ్వరము,సంతాపము,సెగ,తెక,తాపము,
922.వేగులవాడు=అపసర్పుడు,చరుడు,చారుడు,గూఢపురుషుడు,
            పడవాడు,ప్రణిధి,యధార్హవర్ణుడు,వేగరి,వేగువాడు,వేగు.
923.వేదము=ఆమ్నాయము,ఋషి,ఛందస్సు,తొంటిబాస,తొలిపలుకు, నిగమము,ప్రాబలుకు,ప్రామినుకు,ప్రాజదువు,మినుకు.
924.వేట=వెంట,ఖేటము,ఆచ్ఛోదనము,మృగవ్యము.  
925.వేపచెట్టు=అరిష్టము,సర్వతోభద్ర,హింగునిర్యాస,మాలకము,పిచుమందము,పిచుమర్దము,నింబ,పారిభద్రకము,శుకప్రియము,
               శుభ్రదము.
926.వేరుపనస=బహిర్గంధి,మహాఫలము,స్వాదువు,మూలఫలము.
927.వైద్యుడు=వెజ్జు,జైవాతృకుడు,మందరి,దోషజ్ఞుడు,                                                                                    భిషక్కు,భిషజుడు,రోగహారి,అగదంకారుడు.
928.వైశ్యుడు=ఊరవ్యుడు,ఊరుజుడు,ఆర్యుడు,భూమిస్పృశుడు,విశుడు,గుప్త,కోమటి,బచ్చు,బేరి,శెట్టి.
929.వ్రాలు=చే(తి)వ్రాలు,దస్కతు,దస్తూరి,వ్రాత,సంతకము.
930.వ్రేలు=అంగు(ళము)ళీ,అంగుటము,అంగుష్టము,కరపల్లవము,అభీశువు,వేలు,అంగురి.
931.శంఖము=అబ్జము,కంబువు,కూత,కైదువు,చిందము,దరము,సంకు, బూరగొమ్ము,వలమురి,శుక్తి.
932.శతభిషము=నూరుచుక్కలప్రోవు,నీటిరేనిరిక్క,ప్రాచేతము,వారుణము.
933.శత్రువు=రిపువు,వైరి,సపత్నుడు,ద్విషత్తు,ద్వేషణుడు,దుర్హృదుడు,ద్విట్టువిపక్షుడు,ఆహితుడు,అమిత్రుడు,దస్యువు,శాత్రవుడు,శత్రవుడు,అభియాతి,పరుడు,అరాతి,ప్రత్యర్థి,పరిపంధి,భ్రాత్రవ్యుడు,ద్వేషి,అసహనుడు,జిఘాసువు,ప్రతిపక్షుడు,విరోధి,అసుహృత్తు,ప్రత్యవసాత.
934.శనగలు=సెనగలు,చణకము,త్రిపుటము, సతీనము,హరేణువు.
935.శని=మన్దుడు,పఙ్గుడు,కాళుడు,ఛాయాపుత్రుడు,అసితుడు,అర్కజుడు,సౌరి,శనైశ్చరుడు,సూర్యపుత్రుడు.
936.శపధము=ప్రతిజ్ఞ,ప్రతిన,పణము,పరిగ్రహము,ప్రత్యయము,సంగరము,బాఢము,ప్రమాణము,సంధ్య సత్యము,సమయము,ఆన,
         ఒట్టు,బాస,బిరుదు,శపనము.
937.శయ్య=మెత్త,సెజ్జ,సజ్జ,ప్రక్క,పక్క,పఱుపు,పానుపు,పడక.
938.శరభమృగము=అష్టపాత్తు,అష్టాపదము,ఊర్ధ్వపాదము,ఊర్ధ్వతోచనము,అడిదపుమెకము,ఏనుగులగొంగనూడు,చవుగంటి,చౌగంటి,
  దచ్చికాళ్ళ మెకము,దచ్చియడుగులమెకము,మీగండ్ల
                    మెకము,సింగపుగొంగ.
939.శరము=పృషత్కము,బాణము,అజిహ్మరము,ఆశుగము,కలంజము,
               మార్గణము,పత్రి,ఇషువు,అమ్ము,కోల,ములికి,తూపు,
                విశిఖము.
940.శరీరము=కళేబరము,గాత్రము,వపుస్సు,సంహవనము,వర్ష్మ,విగ్రహము,  కాయము,దేహము,మూర్తి,తనువు,మే,మెయి,మేను,ఒడలు,
                 మై,మయి.
941.శర్కర=ఉపల,కలకండ,కండచక్కెర,ఖండశర్కర,నవాతు,పంచదార,
                పులకండము,రసాల,సికత,సీత.
942.శవము=పీనుగు,బడుగు,సబ(ర)ము,కటము,కుణపము,కళేబరము,
                క్షితివర్ధనము,పూయము.
943.శవయానము=ఖటి(ని),ఖటి(ట్టి)క,ఖటువు,కంపరము,పా

1 comment:

  1. చాలా శ్రేష్ఠం అయిన సమాచారం. అభినందనలు, అభివాదములు.

    ReplyDelete